నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పద్మ విభూషణ్, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవిని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై ఘనంగా సన్మానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ లో చిరంజీవి, గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ భవిష్యత్తులోనూ ఇదే రకమైన విజయాలను అందుకోవాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, తన సతీమణి సురేఖతో కలిసి గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.