– అధికారులు, ప్రముఖులతో సమావేశం కానున్న జిష్ణుదేవ్ వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం నుంచి మూడురోజులపాటు ఆరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలను ఆయన సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన అధికారులతోపాటు ప్రముఖ వ్యక్తులతో పలు అంశాలపై సమావేశమవుతారు. ఆయా జిల్లాల్లో ఉన్న సాంస్కృతిక ప్రాంతాల్లో పర్యటిస్తారు. భూగోళశాస్త్రం, సంస్కృతి, ప్రజల జీవన స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా అధికారులతో చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపైనా ఆరా తీస్తారు. ప్రముఖ రచయితలు, కళాకారులు, ప్రముఖ వ్యక్తులతోపాటు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన వారితో సమావేశమవుతారు. ఈ పర్యటనలో జిష్ణుదేవ్ వర్మతోపాటు గవర్నర్ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, జాయింట్ సెక్రెటరీ జె భవాని శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది వెళ్తారు.