నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని కర్లపల్లి గ్రామ సర్పంచ్ ఈక అంజిబాబు కాలుకు ఆపరేషన్ జరగగా ఆదివారం ములుగు జిల్లా గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్ పరామర్శించి మాట్లాడారు. త్వరగా కోలుకొని పార్టీ కార్యక్రమాలు మరియు గ్రామాభివృద్ధి పనుల్లో చురుకుగా పాల్గొంటారని మనో ధైర్యంగా ఉండాలని సూచించారు. పరామర్శించిన వారిలో రాంనగర్ సర్పంచ్ ముక్య మోహన్ ఉన్నారు.