ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం..

నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ మధు శ్రీవాత్సవ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపిసి, సీఈసీ, ఎం ఇ సి గ్రూపులో ఇంగ్లీష్, తెలుగు మాధ్యమంలో దరఖాస్తు చేసుకునేవారు, పదవ తరగతి ఉత్తీర్ణత పత్రము, పాస్ పోర్ట్ సైజు ఫోటో లతో కళాశాలలో సంప్రదించి అడ్మిషన్ పొందాలని సూచించారు.