– నెల వ్యవధిలో పనులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే ఆదేశం
– పనులను పరిశీలించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు రమణారెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నంgoపనులు వేగంగా జరుగుతున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున నెలరోజుల వ్యవధిలో పనులు పూర్తిచేయించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇంజనీరింగ్, ఈఈ కుమార్ గౌడ్‌తో కలిసి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి సోమవారం కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. రూ.2.40 కోట్ల అంచనాలతో ప్రారంభమైన డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను గుత్తేదారు అర్ధాంతరంగా వదిలేయడంతో పనులు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో షిఫ్టింగ్ పద్ధతిన డిగ్రీ, జూనియర్ కళాశాలలు కొనసాగ తున్నాయన్నారు. దాంతో కళాశాల ఆద్యాపక బృందం, విద్యార్థులు ఎమ్మెల్యేను కలిసి షిఫ్టింగ్ పద్దతిలో చదువులకు ఆటంకం ఏర్పడుతున్నదని వివరించారన్నారు. వెంటనే ఎమ్మెల్యే మంత్రి సబితారెడ్డితో మాట్లాడి కళాశాల భవనం పూర్తిచేయించడానికి రూ.46 లక్షలు మంజూరు చేయించడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయన్నారు. పనులను శరవేగంగా పూర్తి చేసి కళాశాల నూతన భవనాన్ని అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు పనులను పరిశీలించారు. త్వరలోనే మంత్రి, ఎమ్మెల్యే చేతుల మీదుగా కళాశాల భవనాన్ని ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు బానుగౌడ్, భర్తాకి జగన్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. ప్రభు, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.