ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిశీలన..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం రోజు ఎంపీపీ టేకులపల్లి వినీత దుర్గారెడ్డి జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఇప్పటివరకు ఆయన అడ్మిషన్ల ప్రక్రియను తరగతులు కొనసాగించే తదితర అంశాలపై లెక్చరర్ విష్ణును అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జడ్పిటిసి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల కొనసాగేలా తమ వంతు ప్రయత్నం కొనసాగిస్తానని అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం అయ్యేలా చేస్తానని ఆయన అన్నారు.