జనాభా దామాషా ప్రకారం సార్వత్రిక ఎన్నికల్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందాలంటే కుల గణన చేపట్టడం అత్యంత ఆవశ్యకరమైనదని,జాతీయ బీసీ సంఘం మండల అధ్యక్షుడు బొంగోని అభిలాష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం శంకరపట్నం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని,అలాగే కుల గణన చేపట్టిన తర్వాత ఫలితాల ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేసిన తరువాతనె సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిాండ్ చేశారు.లేనియెడల మండల కేంద్రంలో వివిధ కుల సంఘాలు,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు తాటిచెర్ల తిరుపతి, వడ్డెర సంఘం నుండి శివరాత్రి శ్రీనివాస్, మైనారిటీ నుండి ఆరిఫ్, సంపత్ ముదిరాజ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.