అగ్ని ప్రమాద బాధితుని ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

Govt should help fire victim: CPI(M)నవతెలంగాణ – గోవిందరావుపేట
అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన పిట్టల నరసయ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ముద్దులగూడెం గ్రామంలో పిట్టల నరసయ్య  ఇల్లు గ్యాస్ పేలి ఇల్లు మొత్తం దగ్ధమై సర్వం కోల్పోయినందున సీపీఐ(ఎం) మండల కమిటీ బాధితుని పరామర్శించి అతనికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. 50 కిలోల బియ్యం బట్టలు ఇతర సామాగ్రి సహాయం చేయడం జరిగింది. నరసయ్యను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ(ఎం) పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతనికి ప్రభుత్వం వెంటనే పక్కాఇల్లు అతను కోల్పోయినటువంటి డబ్బు బంగారం ఇతర వంట సామాగ్రి ప్రభుత్వం నష్టపరిహారంగా ఇవ్వాలని సీపీఐ(ఎం) పార్టీ డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు మొత్త కాలి పోయిందని తెలిపారు  గ్యాస్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు  ఇన్సూరెన్స్ మంజూరు చేయాలని  గ్యాస్ కంపెనీని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రెడ్డి సాంబశివ పొదిల్లా చిట్టిబాబు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి గొంది రాజేష్ సోమ మల్లారెడ్డి అంబాల మురళి శాతం సూర్యనారాయణ ఉపేంద్ర చారి కవిత కందుల రాజేశ్వరి అశోకు పల్లపురాజు పిట్టల అరుణ్ గజ్జి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.