నవతెలంగాణ – సిరిసిల్ల
అధికారికంగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఓ ఉపాధ్యాయినిని శనివారం సస్పెండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు పరిశీలించారు. సెలవు విషయమై అధికారికంగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన స్కూల్ అసిస్టెంట్ రాధారాణి టీచర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.