
రుద్రంగి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు మరియు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఇట్టి వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ. విద్యార్థి దశ చాలా ముఖ్యమైనదని స్కూల్లో టీచర్లు చెప్పేది ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేది క్రమశిక్షణతో విని చదివినట్టాయితే మీ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు.మొబైల్ ఫోన్లకు,చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు.గత 14 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యనికి ఉపాధ్యాయ బృందానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రుద్రంగి హై స్కూల్లో చదివిన జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనంతరం పదవ తరగతి విద్యార్థులు రానున్న పరీక్షల్లో బాగా చదివి మంచి ఉత్థిర్ణత సాధించి గ్రామానికి స్కూల్ కి మంచి గుర్తింపు తీసుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో, జడ్పిటిసి గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, మాజీ ఉప సర్పంచ్ బైరి గంగమల్లయ్య,పాఠశాల డైరెక్టర్లు ఎర్రం గంగనర్సయ్య, తీపిరెడ్డి వెంకట్ రెడ్డి,పడల సురేష్,కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్,ప్రిన్సిపాల్ హరినాథ్ రాజ్,పాల్గొన్నారు.