శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

– ఘన స్వాగతం పలికిన ఆలయ ఛైర్మన్ తోటకూర వెంకటేష్ యాదవ్…
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి జిల్లా  కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అందెం సంజీవరెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం  చైర్మన్ తోటకూర వెంకటేష్ యాదవ్ ఘన స్వాగతం పలికి, వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్, తోటకూరి బాల మహేష్ యాదవ్,తోటకూర మహేష్ యాదవ్, మేకల లింగస్వామి యాదవ్, రాజు యాదవ్, ఉడుత  అమర్,  మేకల బాలు యాదవ్ లు పాల్గొన్నారు.