నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో గల స్వయంభు శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షణ కార్యక్రమం నిర్వహించారు. కాగా పూర్ణ గిరి ఆలయంలో ఆలేరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనం చేసి, పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నరసింహ ఉపవాసకులు బత్తిని రాములు గౌడ్, మాజీ సర్పంచ్ ఎల్లంల శాలిని జంగయ్య యాదవ్, ఆలయ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు హేమెంధర్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, పట్టణ అధ్యక్షులు బందారపు బిక్షపతి, పెరుమల్లి శ్రీధర్ గౌడ్ ,ముక్కెర్ల మల్లేష్ యాదవ్, వెంకట్ రెడ్డి, ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ, జిల్లా నలుమూల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.