ఖమ్మం లోని బైపాస్ రోడ్డు లో గల శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఖమ్మం కురుమ కుల సోదరుల ఆహ్వానం మేరకు శ్రీ బీరప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం కురుమ కుల సోదరులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమ కుల సోదరులు ఉద్యోగ, రాజకీయ, ఆర్థికంగా ఎదగాలని ఐక్యమత్యంగా ఉంటే అన్ని సాధ్యం అవుతాయని అన్నారు. బీరప్ప స్వామి కృపతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.