గౌడ సంఘం 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – మద్నూర్

కామారెడ్డి జిల్లా గౌడ సంఘం 2024 నూతన క్యాలెండర్ మద్నూర్ మండల కేంద్రంలో గురువారం నాడు గౌడ సంఘం జిల్లా నాయకులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జిల్లా గౌడ సంఘం క్యాలెండర్ ప్రచురించడం జరుగుతుందని, 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను మద్నూర్ మండల కేంద్రంలో స్థానిక గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్ నాగేష్ గౌడ్ తదితరులు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.