గౌడ సంఘం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన కొండూరు గ్రామానికి చెందిన పులి సోమయ్యను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి ప్రజా సేవలో ఉంటున్న పులి సోమయ్య నిబద్ధత కలిగిన వ్యక్తి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు వరించాలని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో
జిల్లా నాయకుడు ఆకుల సురేందర్ రావు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎండీ నాయిమ్, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, సోమేశ్వర్ రావు, సత్యనారాయణ రావు, ఉపేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.