నవతెలంగాణ-మల్హర్ రావు : రాష్ట్ర అటవీశాఖ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సహకారంతో గ్రామాల్లో పెంచాల్సిన మొక్కలు, పచ్చదనం, వన్యప్రాణ సంరక్షణ,అడవుల సంరక్షణ తదితర వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెండు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి నందు ఏర్పాటు చేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి డివిజనల్ పంచాయతీ అధికారి వీరభద్రయ్య,మండలంలోని వళ్లెంకుంట పంచాయతీ నరేష్,రేగొండ మండలంలోని గోరుకొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ లు శిక్షణ కార్యక్రమానిలొ పాల్గొన్నారు.