సోపూర్ సర్పంచ్ ను సన్మానించిన జీపి సెక్రట్రీ..

నవతెలంగాణ  – జుక్కల్
గ్రామ పంచాయతీ  సోపూర్ పాలకవర్గం  ఆదేండ్లు   పాలన కాలం సమాప్తము అయినందున పంచాయతీ కార్యదర్శి అశోక్ రాథోడ్ వారికి ధన్యవాదాలు సమావేశం ఏర్పాటు చేసి సర్పంచ్ తో పాటు వారి పాలకవర్గనికి వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వారికి శాలువతో సత్కరించి  ఙ్ఞాపికలు అందవేయడం  జరిగింది. ఈ  సమావేశానికి ఇంతవరకు ఐదెండ్ల కాలం సర్పంచ్  గా పని చేసిన సర్పంచ్  అనుషాబాయి  అద్యక్ష్యత  వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్  కే.యాదవ్ రావు, ఎంపిటిసి ఆశోక్ మరియు ఇతర  వార్డుసబ్యులు, ఎంపిపిఎస్  పాఠశాల హెచ్ఎం జరినా, బృందం తదితరులు పాల్గొన్నారు .