వడదెబ్బతో జి.పి కార్మికుడి మృతి

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పంచాయతీ సంత మార్కెట్లో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్న పోకల నాగరాజు(55) వడదెబ్బ కారణంగా బుధవారం మృతి చెందారు.పంప్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తుండగా బస్టాండ్ లోని మోటార్ ను ఆన్ చేసే క్రమంలో వడదెబ్బ గురై బస్టాండ్ ప్రయాణీకులు ప్రాంగణంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.