
గ్రామ పంచాయతీ కార్మికుల సంక్షేమాన్ని గుర్తించాలంటూ హైదరాబాద్ లోని ఇందిర పార్క్ వద్ద తలపెట్టిన ధర్నాకు తరలినట్టు మండలంలోని అయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులు మంగళవారం తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుల క్రమబద్ధీకరణ,వేతనాల పెంపు,మల్టీ పర్పస్ విధానం రద్దు,పీఎఫ్,బీమా సౌకర్యాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు గ్రామ పంచాయతీ కార్మికులు తెలిపారు.