
గ్రామపంచాయితీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె బుధవారం నాటికి 20 వ రోజుకు చేరింది. ఈ క్రమంలో స్థానిక పంచాయతీ కార్మికులు ప్రదర్శన నిర్వహించి, భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. వాన ను సైతం లెక్కచేయకుండా ప్రధాన రహదారి మార్గంలో జోలె పట్టి బిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేసారు. ఈ సమ్మెకు భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ )జిల్లా నాయకులు సయ్యద్ సలీం, మండల అధ్యక్ష కార్యదర్శులు జి.రామకృష్ణ సయ్యద్ రఫీ పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అనంతరం సయ్యద్ సలీం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 20 రోజులుగా జరుగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు తమ పార్టీ ప్రజాసంఘాల నుండి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా గ్రామపంచాయతీ కార్మికుల యొక్క సమస్యలు ఏ పాలక ప్రభుత్వాలు వచ్చిన పట్టించుకోక పోవటం చాలా దుర్మార్గమైన విషయం అని అన్నారు. కార్మికుల ప్రధాన డిమాండ్స్ గా ఉన్న మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని,కనీస వేతన చట్టం అమలు చేయాలని, అర్హత కలిగిన బిల్ కలెక్టర్ లకు సహాయ కార్యదర్శిగా నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాల్లో బిక్షాటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్,గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (జేఏసీ) మండల అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి వెంకటప్పయ్య, కేసుపాక నరసింహారావు, గౌరవాధ్యక్షులు మట్లకుంట కామేశ్వరరావు,మూల అప్పన్న, మండల ట్రెజరర్ వేల్పుల ముత్తారావు, మండల కమిటీ సభ్యులు మురళి, ఆరేపల్లి నాగేంద్రరావు, కట్ట శీను, రాజపుత్ర రంజిత్ సింగ్(నందు), బాణాల వరలక్ష్మి, అల్లాడి ధనమ్మ,బద్దే లక్ష్మిపద్మ, జ్యోతి, రాణి, శ్యామ్, రమాదేవి స్వప్న , రాధాకృష్ణ, ఇంద్ర, రాణి, నాగమణి, రాము తదితరులు పాల్గొన్నారు.