
సమస్యల పరిష్కారం కోసం జీపీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 8వ రోజుకు చేరింది. రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా కళ్ళకు గంతలు తో నిరసన చేపట్టారు. స్థానిక మూడు రోడ్ల కూడలిలో కళ్లకు గంతలు కట్టుకొని ప్రదర్శనగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసి నాయకులు మాట్లాడుతూ.. పాలకులు తమకు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా తమ జీవితాలతో ఆటలాడు కుంటున్నారన్నారు.తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరా అపేదిలేదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి వెంకటప్పయ్య, కేసుపాక నరసింహారావు, గౌరవ అధ్యక్షులు మట్లకుంట కామేశ్వరరావు,మూల అప్పన్న మండల ట్రెజరర్ వేల్పుల ముత్తారావు, కమిటీ సభ్యులు మురళి, కట్ట శీను, విజయకుమార్, రంజిత్ సింగ్, బాణాల వరలక్ష్మి, పద్మ, రమాదేవి, స్వప్న, రాధాకృష్ణ, అమూల్య, ఇంద్ర రాణి, నాగమణి, మరియమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు.