20వ రోజుకు చేరిన జిపి కార్మికుల సమ్మె..

నవతెలంగాణ-నవీపేట్: గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె మంగళవారం 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కారోబార్ల సంఘం నాయకుడు మీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను పర్మినెంట్ చేసినట్లు గ్రామపంచాయతీ కార్మికులను సైతం పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, లక్ష్మణ్, లక్క గంగారం, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.