– గ్రామపంచాయతీ కార్మికుల వినతి..
నవతెలంగాణ – వేములవాడ
నేడు గ్రామపంచాయతి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జీవో నెంబర్ 51 రద్దు చేసి వెంటనే జీతాలను పెంచాలని కోరుతూ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆదివారం ఆయన నివాసంలో వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ తెలిపినట్లు కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్యాల నరసయ్య, అర్బన్ మండల అధ్యక్షులు రాజశేఖర్, రూరల్ మండల అధ్యక్షులు ముదుగంపెళ్లి అనిల్, మల్లారం గంగరాజు, సింగరపు రాజు, అచ్చ కాంతయ్య, కొమ్ము మధు తదితరులు పాల్గొన్నారు.