
గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గ్రామపంచాయతీ కార్మికులు మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. గ్రామ పంఛాయితి కార్మికుల నిరవధికా సమ్మే ఏడవ రోజుకు చేరుకుందన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగారం దుర్గయ్య మామిడి సంపత్, తాడూరి లక్ష్మి, వెంకటేశం, కాసర్ల సదానందం, నాగరాజు, కార్తీక్ నరసవ్వ, తిరుమల తదితరులు పాల్గొన్నారు.