నవతెలంగాణ -సుల్తాన్ బజార్
బిపిఎన్ఐ మార్గదర్శకాలతో జెడి డాక్టర్ సుధీర ప్రోత్సాహంతో బ్రెస్ట్ ఫీడింగ్ పద్ధతులను అమలు పరుస్తున్నందుకు న్యూఢిల్లీ నేషనల్ అక్యుడేషన్ సెంటర్ కేంద్ర సమన్వయకర్త డాక్టర్ అరుణ గుప్తా హైదరాబాద్ కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి కి గ్రేడ్ వన్ బెస్ట్ అక్రిడేషన్ సర్టిఫికెట్ ప్రకటించారు. శుక్రవారం కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి కి ఈ సర్టిఫికెట్ రావడానికి కృషి చేసిన ఆర్ బి ఎస్ కే డాక్టర్ వసంత. పీడియాట్రిక్స్ హెచ్ ఓ డి డాక్టర్ జ్యోతి, అర్ఎంఓ డాక్టర్ సాధన, గైనకాలజీ హెచ్ ఓ డి డాక్టర్ జలజ, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ లను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ అభినందించారు.