క్రమంగా పెరుగుతున్న చలి

– సంగారెడ్డిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో చలితీవ్రత క్రమంగా పెరుగుతున్నది. సంగారెడ్డిలో అత్యల్పంగా 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. సూర్యాపేట, వనపర్తి, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి. వచ్చే మూడు రోజుల పాటు కూడా చలితీవ్రత ఉండనున్నది. అది క్రమంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా 35 డిగ్రీల లోపే(రంగారెడ్డి-36, జగిత్యాల 35.2 డిగ్రీలు మినహా) నమోదవుతున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఆరు డిగ్రీల మేర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. తూర్పు, ఈశాన్య దిశలో రాష్ట్రం మీదుగా ఉపరితల గాలులు వీచే అవకాశముంది.