వేములవాడలో పర్యటించిన పట్టభద్రుల అభ్యర్థి..

Graduation candidate who visited Vemulawada..– రాజన్నను దర్శించుకున్న ఆల్ఫోర్స్  నరేందర్ రెడ్డి..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని అల్ఫోర్స్ విద్య సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి, రాజన్న దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్నారు. వేములవాడలో విస్తృతంగా పర్యటించిన డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ ,మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి,   వేములవాడలో విస్తృతంగా పర్యటించి వివిధ రంగాల ప్రతినిధులను కలిసి రాబోయేటువంటి ఎన్నికలలో పట్టభద్రుని ఓటరుగా నమోదు చేసుకొని తనకు మద్దతు తెలిపాలని కోరారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె ను కట్టి  మొక్కలు చెల్లించుకున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ తల్లి ఆశల కనుగుణంగా పనిచేస్తానని అన్నారు.  భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి వారి ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలుపుతూ పట్టణ కేంద్రంలోని బార్ అసోసియేషన్ సందర్శించి, న్యాయవాదులతో ముఖాముఖి నిర్వహించి వారికి పట్టబదుల ఓటర్ ఆవశ్యకతను తెలియజేశారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ సంస్థను సందర్శించి పాఠకులకు పట్టబద్రులు ల ఓటరు ఆవశ్యకతను వివరించడమే కాకుండా ఓటు నమోదుకై చేపడుతున్నటువంటి ప్రక్రియను తెలుపుతూ ఓటర్ల  లో చైతన్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో యువకులు, యువజన సంఘాల నాయకులు అధిక సంఖ్యలో విచ్చేసి వారికి ఘన స్వాగతం తెలిపి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొక్కు రాజు సత్యనారాయణ వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్ సందీప్ గిరిధర్ తో పాటు తదితరులు ఉన్నారు.