నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధం ఎత్తివేసి భూమిలేని పేదలకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని , ప్రభుత్వ భూములను సేద్యం చేసుకుంటున్న పేదలకు పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఆదివారం భువనగిరి మండల పరిధిలోని పెంచికల్ పహాడ్, కృష్ణాపురం గ్రామాలలో ఇంటింటికి వెళ్లి వ్యవసాయ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంజయ్య పాల్గొని మాట్లాడు భువనగిరి మండలంలో భూ పంపిణీ నిషేధం ఉండడంవల్ల గత 20 సంవత్సరాల నుంచి పేదలకు సెంటు భూమి కూడా ప్రభుత్వ భూమి ఇవ్వడం లేదని అన్నారు. అనేక గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయని అవి మొత్తం కూడా అన్యాక్రాంతమవుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ భూములు పేదలకు పంపిణీ చేస్తే తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఉపయోగపడుతుందని, భూమి ఉంటే ఆత్మ గౌరవంతో జీవిస్తారని తెలియజేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో అనేక గ్రామాల్లో సంవత్సరాలకు కొద్దిగా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నారని ఆ భూములకు పట్టా సర్టిఫికెట్స్ ఇవ్వమంటే ప్రభుత్వం భూ పంపిణీ నిషేధం పేరుతో పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వడం లేదని అన్నారు. ఇప్పటికైనా పేదలు సేద్యం చేసుకుంటున్నా భూములకు పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అర్హత ఉన్న పేదలకు, వ్యవసాయ కూలీలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణానికి కూడా 15 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు. వ్యవసాయ కూలీలకు, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కార్మికులకు రోజు కూలీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 800 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అంజయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, గ్రామ నాయకులు, వ్యవసాయ కూలీలు గొలుసుల యాదగిరి, గొలుసుల ఎల్లయ్య, చింతల సతీష్, గొలుసుల మల్లమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, సుబ్బురు మౌనిక, బోనగిరి అండాలు, నల్లమాసు మంగమ్మ, వడ్ల రమాదేవి లు పాల్గొన్నారు.