పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

నవతెలంగాణ – బొమ్మలరామరం
పట్టభద్రులైన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్ అన్నారు.ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…ప్రభుత్వం ఈ నెల 6ను చివరి తేదీగా ప్రకటించిన దృష్ట్యా నూతన ఓటర్లతో పాటు గతంలో ఓటు వేసిన వాళ్ళు కూడా మళ్ళీ నమోదు చేసుకోవాలని తెలిపారు.ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పట్టభద్రులు శాసనమండలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సిరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామీడి శ్రవణ్ ప్రసాద్ రెడ్డి, నాయకులు బుంగపట్ల గోపికృష్ణ, అలీమ్,జెమిల్, ఉపేందర్,శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.