
నవతెలంగాణ – కోహెడ
పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలని ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావు అన్నారు. గురువారం అయన పట్టభద్రులను, ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్లను కలిశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాబోయే ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే పట్టభద్రులంతా ఆన్‌లైన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రయివేట్ పాఠశాలలో ఆన్‌లైన్ నమోదు కేంద్రం ఉంటుందని పట్టబద్రులు తమకు అందుబాటులో ఉన్న ప్రైవేటు స్కూలుకు వెళ్ళినట్లయితే ఉచితంగా వారి పేరు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినట్లయితే పట్టభద్రుల తరఫున, ప్రయివేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడి పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు, ప్రైవేటు టీచర్లకు ఉచిత ఆరోగ్య భీమా సదుపాయము కల్పించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల కరస్పాండెంట్‌లు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.