మంచిరేవులలో గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు

నవతెలంగాణ-గండిపేట్‌
చిన్నారులందరూ చక్కని మార్గంలో నడిపించేందుకు కృషి చేయా లని హెడ్‌మాస్టర్ రవిబాబు అన్నారు. సోమవారం నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల గ్రామంలో అంగన్‌వాడీ మొదటి కేంద్రంలో గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎదుగుతున్న విద్యార్థులకు విద్యాబుద్ధులతో పెంచాలన్నారు. ఐదు సంవత్సరాలు నిండి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం విజయలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్‌ సుధారాణి ఆయాలు అటెండర్స్‌ తదితరులు పాల్గొన్నారు