నవతెలంగాణ – రెంజల్
యాసంగి కోతలు ప్రారంభం కావడంతో రైతులకు ధాన్యం కల్లాలు లేక రోడ్లపైనే ధాన్యం ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డుకు ఒక వైపున దాన్ని ఆరబెట్టడంతో ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. అప్పట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు తమ పంట పొలాలలో ధాన్యం కల్లాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చినా, కొంతమంది రైతులు మాత్రమే వాటిని నిర్మించుకున్నప్పటికీ ఉపయోగంలోకి రాకుండా పోయింది. రైతులకు ప్రత్యామ్నాయగా ఏ లాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారికి రోడ్లపైనే ధన మారబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన భూములను కేటాయించి దాన్ని ఆరబెట్టుకోవడానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల రోడ్డుపై దాన్ని ఆరబెట్టుకోవడంతో ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంది.