ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి

– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్
నవతెలంగాణ – వలిగొండ రూరల్
రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్లలో పోసి నెలలు గడుస్తున్న ప్రభుత్వం నేటికీ మార్కెట్లను ప్రారంభించకపోవడం రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని ఇప్పటికైనా వెంటనే మార్కెట్ లను ప్రారంభించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.
   గురువారం రోజున మండల పరిధిలోని సంగెం గ్రామంలో నెల రోజుల నుండి పేరుకుపోయిన ధాన్యం కుప్పలను సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు మద్దతు ధర కోసం ప్రభుత్వ ఐకెపి, సింగల్ విండో కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి పోస్తే కొనుగోళ్లను ప్రభుత్వం నేటికీ ప్రారంభించకపోవడం వల్ల అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని  ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే కొనుగోళ్ళను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
            ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల మండల వ్యాప్తంగా 50 శాతం ప్రైవేట్ వ్యాపారస్తులకు, కొన్ని రైస్ మిల్లర్లకు మద్దతు ధర లేకుండా నష్టపోతు ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతాంగానికి వచ్చిందన్నారు. ప్రభుత్వం మార్కెట్లను హడావుడిగా ప్రారంభించి వదిలేసిందే తప్ప కొనుగోళ్లను ప్రారంభించలేకపోయిందని వెంటనే కొనుగోళ్లను ప్రారంభించి అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ‘ఏ’ గ్రేడ్ కిందనే కొనుగోలు చేయాలన్నారు.
   ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి మండల కమిటీ సభ్యులు భీమనబోయిన జంగయ్య,మండల నాయకులు మెట్టు రవీందర్ రెడ్డి, వర్కట్ పల్లి గ్రామ శాఖ కార్యదర్శి గూడూరు బుచ్చిరెడ్డి, నాయకులు అంగిటి దేవేందర్ రెడ్డి, కేసాని మల్లేశం, పన్నాల పాండు రెడ్డి, రొండి మల్లేశం, రైతులు నకిరేకంటి బాలయ్య, మేడబోయిన శ్రీనివాస్, సురకంటి లింగారెడ్డి, జక్కుల వెంకటేశం, రైతులు పాల్గొన్నారు.