ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్దం: సీహెచ్ సత్యనారాయణ

Preparation of Grain Purchase Centers: CH Satyanarayanaనవతెలంగాణ – అశ్వారావుపేట
ఖరీఫ్ 2024 – 2025 సంవత్సరానికి గాను ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లిస్తూ సన్న,దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సిద్దం చేసామని అశ్వారావుపేట పీఏసీఎస్ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ సోమవారం తెలిపారు. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం అశ్వారావుపేట పరిధిలోని అశ్వారావుపేట,ఊట్లపల్లి,జమ్మి గూడెం,మద్ది కొండ,అచ్యుతాపురం లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసామని,ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాళ్ల కు రూ.2320 లు కు కొనుగోలు చేస్తామని,సన్న రకం ఒక క్వింటాలు కు బోనస్ గా రూ.500 లు,అలాగే దొడ్డు రకం ధాన్యానికి రూ.2300 లు చెల్లిస్తామని,ప్రభుత్వం కల్పించే ఈ సదవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఆయన వెంట సీఈఓ విజయ్ బాబు,సిబ్బంది అనిల్ కుమార్ లు ఉన్నారు.