
నవతెలంగాణ – చిన్నకోడూరు
ధాన్యం కొనుగోలులో ఎలాంటి జాప్యం చేయకుండా ధాన్యాన్ని రైస్ మిల్లులకు వెనువెంటనే తరలించాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిన్నకోడూరు మండలంలోని రామునిపట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో గల వసతులు, కొనుగోళ్ళ నిర్వహణ గురించి రైతులను ఆరా తీశారు. హమాలీల సంఖ్య పెంచి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని కొనుగొలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు. శ్రీ సాయి రైస్ మిల్లు, శివ బాలాజీ ఇండస్ట్రీస్, రామునిపట్ల రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలని సూచించారు. ఎఫ్ఏక్యూ ధాన్యాన్ని కూడా తాలు, తూకం పేరిట కోతలు విధిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.