అకాల వర్షంతో తడిసిన ధాన్యం

అకాల వర్షంతో తడిసిన ధాన్యంనవతెలంగాణ-దిలావర్‌పూర్‌, ముధోల్‌
ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం సోమవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దయింది. దిలావర్‌పూర్‌, ముధోల్‌ మండలాల్లో ఎండబెట్టిన ధాన్యంపై టార్పలిన్లు కప్పింనా.. ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో గాలులకు అవి లేచి పోవడంతో ధాన్యం తడిపోయింది. ధాన్యం కుప్పల్లోకి నీరు చేరి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని రైతులు ఎండబెట్టేందుకు మళ్లీ అష్టకష్టాలు పడ్డారు. తాము పడ్డ శ్రమ రెండితలయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.