– ఆందోళనలో రైతాంగం
నవతెలంగాణ – రెంజల్
పెంజల్ మండలంలోని రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్ద అవడంతో రైతుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పడ్డ చేతికి వచ్చిందన్న గంపెడు ఆశతో ఉన్న రైతులకు అకాల వర్షాలు కన్నీటిని మిగిల్చాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్లను ఆరబెట్టుకోవడానికి స్థలం లేకపోవడంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వాహనాల రాకపోకలకు ధాన్యం వాటి టైర్ల కింద పడి నష్టం జరుగుతుందంటున్నారు. తడిసిన ధాన్యం నల్ల రంగు మారడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.