నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామ పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ ఝా అన్నారు. మంగళవారం నాడు భువనగిరి మండలం అనంతారం గ్రామాన్ని 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ ఝా, మనోజ్ పాండా, జాయింట్ సక్రెటరీ కే.కే. మీశ్రా, జాయింట్ డైరెక్టర్ దావిందర్ చోడా, డిప్యూటీ డైరెక్టర్ అభిషేక్ నందన్, అసిస్టెంట్ డైరెక్టర్ భద్ భేష్ హాజారిక సందర్శించారు. ముందుగా గ్రామంలో పల్లె దావఖానా ను సందర్శించి, గ్రామీణులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. గ్రామంలో నిర్వహిస్తున్న స్వచ్ఛదనం- పచ్చదనం, పారిశుధ్యం కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ వారు తిలకించారు. జిల్లా ప్రజా పరిషత్ ై స్కూల్లో నిర్మించిన అదనపు తరగతులను పరిశీలించారు. పాఠశాల చిన్నారులతో ముచ్చటించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సభ్యులు అజయ్ నారాయణ ఝా మాట్లాడుతూ ఇక్కడి గ్రామ పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అధ్యయనానికి ఇతర రాష్ట్రాల నుండి రావడం జరుగుతున్నదని, తెలగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు మోడల్ గా నిలిచిందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గ్రామపంచాయతీలో పనులు బాగా జరుగుతున్నాయని, రాబోయే 16వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా కూడా ఇంకా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఆరోగ్యం, విద్యా రంగాలలో సేవలు ఇంకా పెరగాల్సి ఉందని, అంగన్వాడీలలో మహిళల అభ్యున్నతి కోసం ఇంకా ఎక్కువ పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు. గ్రామంచాయతీలు స్వతంత్రంగా తమ నిర్ణయాలను తామే తీసుకునే స్థితికి రావాలని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో స్వయం సహాయక మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయని, సూక్ష్మస్థాయి పరిశ్రమల ద్వారా మహిళాభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని అన్నారు.
జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే మాట్లాడుతూ ఈ జిల్లా చారిత్రక, సాంస్కృతిక సంప కలిగిన జిల్లా అని, పోచంపల్లి చేనేత రంగం ప్రపంచం లోనే ప్రసిద్ధి గాంచిందని, యాదగిరిగుట్ట, కొలనుపాక దేవాలయాలు ఆధ్యాత్మికతతో ప్రఖ్యాతి గాంచాయని అన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు నేరుగా గ్రాంట్లు వస్తాయని, పారిశుద్యం, త్రాగునీటికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్తు గ్రాంట్లతో త్రాగునీటి వనరుల కోసం వినియోగించడం జరుగుతుందని, మండల పిషత్ గ్రాంట్ల ద్వారా హెల్త్, డ్రైనేజీల వ్యవస్థ, పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి వినియోగించడం జరుగుతుందని, గ్రామపంచాయతీ నిధుల ద్వారా పారిశుద్ధ్యం పనులు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లను అప్ గ్రేడ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటుతో పక్కాగా పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా వ్యవస్థలను క్షేత్రస్థాయిలో పర్వేక్షించడం జరుగుతున్నట్లు, పచ్చదనంపై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సభలో సమాఖ్య మహిళలు ప్రభుత్వం అందిస్తున్న లబ్ధి ద్వారా తాము చేపట్టిన పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ఆర్.వి కర్ణన్, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, జిల్ా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే గంగాధర్, జిల్లా పరిషత్ ముఖ్య నిర్వహణ అధికారి శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ యశోద జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శామ్యూల్, జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహ, అడిషనల్ డిఆర్డిఓ సురేష్, అనంతారం మాజీ సర్పంచ్ చిందం మల్లికార్జున్, ఉప సర్పంచ్ విట్టల్ వెంకటేష్ , అధిారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.