గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు రైన్ కోట్స్ అందజేత 

Gram Panchayat distributes raincoats to multipurpose workers– ఎంపీడీవో బాలరాజు 
నవతెలంగాణ – నెల్లికుదురు
ఇటీవల కురుస్తున్న వర్షాలకు గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు తడిసి అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు వారికి రైన్ కోర్స్ అందిస్తున్నట్లు ఎంపీడీవో బాలరాజు ఎంపీవో బానోతు పద్మ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని నెల్లికుదురు గ్రామపంచాయతీ సిబ్బందికి రైన్ కోర్స్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లికుదురు గ్రామ పారిశుద్ధ పనులను చేయడంలో వర్షాలకు తడిసి ముద్దయి విష జ్వరాలు పాలు కాకుండా ఉండేందుకే ఈ సిబ్బందికి రైన్ కోర్స్ అందిస్తున్నామని అన్నారు. గ్రామంలో చెత్తాచెదారం లేకుండా చూసుకుంటూ గ్రామంలో అన్ని విధులలో బ్లీచింగ్ చల్లుకుంటూ దోమలు ఎక్కువ నిల్వ లేకుండా నీటి నిల్వలు లేకుండా చూడాలని అదేవిధంగా రోజు సాయంత్రం పూట దోమలను తరిమెందుకు పాక్ చేయించాలని ఈ విధంగా గ్రామపంచాయతీ చేసినట్లయితే ఆ గ్రామపంచాయతీ పారిశుద్ధ్యంలో రూపురేఖలే మారే అవకాశాలు ఉంటాయని అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న వర్కర్స్ అందరు కలిసి గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. సిబ్బంది తడవకుండా రైన్ కోర్స్ ధరించి ఎవరి పనులు వారు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ పంచాయతీ కార్యదర్శి రాజేష్ కరోబార్ రవి సిబ్బంది ఉన్నారు.