గ్రామపంచాయతీ ఉద్యోగుల నిరసన

– 18 గ్రామ పంచాయతీలలో సరిగా జీతాలు రాలేవని పంచాయతీ కర్మచారులు ఆవేదన
– వారం రోజులలో సమస్య పరిష్కరించాలి
– గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజ్‌
నవతెలంగాణ-కోట్‌పల్లి
మండలంలో పంచాయతీ కార్మికులకు గత 4 నుండి, 7 నెలలుగా జీతాలు రావడం లేదని మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయం దగ్గర గ్రామపంచాయతీ ఉద్యోగులు నిరసన తెలియజేశారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో సరిగా జీతాలు రాలేవని పంచా యతీ కర్మచారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా పంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బీ బాల్‌రాజు మాట్లాడుతూ..వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో నిరవదిక సమ్మెకు దిగు తామని హెచ్చరించారు. ఈ విషయమై మండల అభివద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు. ఆయన ఈ సమ స్యను పై అధికారుల దష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చేస్తామని మండల ఇన్‌చార్జి అభివద్ది అధికారి డానియల్‌ తెలిపినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయ తీ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు కమ్మరి సదా నందం, కార్యదర్శి కమ్మరి బ్రహ్మం, ముకుందం, ఖదీర్‌, నన్యానాయక్‌, రవి, నర్సింలు, రత్నం, ఆనందం, అంజయ్య పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.