– అన్ని పార్టీలు తమ మ్యానిఫెస్టోలో స్పష్టతనివ్వాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 60 వేల మంది దాకా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, మల్టీపర్పస్ విధానంలో పనిచేస్తున్నారనీ, వారి సమస్యలు పరిష్కరించేందుకు ఏంచేస్తాయో అన్ని పార్టీలూ స్పష్టంగా చెప్పాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. తాము సూచించిన అంశాలను అన్ని పార్టీలూ తమ మ్యానిఫెస్టోల్లో పొందుపర్చాలని కోరింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రాలను అందజేసింది. ఈ కార్యక్రమాల్లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, రాష్ట్ర అధ్యక్షులు గ్యారపాండు, రాష్ట్ర నాయకులు పి.గణపతిరెడ్డి, పి.సుధాకర్, పి.యాదమ్మ, పి.వినోద్కుఆర్, టి.మహేశ్, వెంకటేశ్‌గౌడ్, మల్లేశ్, బి.అప్పిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.