
– పెద్దకొడప్ గల్ బాధ్యతలు స్వీకరించిన ఎమ్మార్వో దశరథ్
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని గ్రామపంచాయతీలో సర్పంచుల పాలన ముగియడంతో గురువారం ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం చుట్టారు. 25 గ్రామపంచాయతీలలో అల్లాపూర్ డి విటల్ పంచాయతీరాజ్ శాఖ, అంజని నసీమా ఐసిడిఎస్, బేగంపూర్ రాజేందర్ హాస్టల్ వార్డెన్, బూరుగుపల్లి రమేష్ రెవిన్యూ, చావని తాండ సురేఖ రెవెన్యూ, చిన్న దివిసింగ్ తాండ వెంకట్ రెడ్డి పంచాయతీ రాజ్, జగన్నాథ్ పల్లి ప్రియాంక వ్యవసాయ శాఖ, కస్లాబాద్ బాద్ సింగ్ ఐకెపి, కాటేపల్లి నదిముద్దీన్ వ్యవసాయ శాఖ, కాటేపల్లి తాండ సూర్యకాంత్ ఎంపిఓ, పెద్ద కొడంగల్ దశరథ్ ఎమ్మార్వో, కుభ్య నాయక్ తండ బాలాజీ ఐకెపి, లింగంపల్లి మాధవి వ్యవసాయ శాఖ, పారేడ్పల్లి రవి విద్య శాఖ, పెద్ద డివిసింగ్ తాండ రూప వ్యవసాయ శాఖ, పోచారం సతీష్ ప్రధానోపాధ్యాయుడు, పోచారం తాండ రవికాంత్ డిటి, సముందర్ తాండ హనుమాన్లు పంచాయతీరాజ్, శివాపూర్ పండరి రెవెన్యూ శాఖ, తక్కడపల్లి చిన్న ఎంపీడీవో రాణి, తలాబ్ తండా పద్మ జూనియర్ అసిస్టెంట్, ఈ విధంగా 25 గ్రామపంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీల్లో గెజిటెడ్ అధికారులైన ఎంపీడీవోలు, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ లు, ఎంపీ ఓలు, మండల వ్యవసాయ అధికారులు, పశు వైద్యాధికారులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మిషన్ భగీరథ ఏఈలు, పీజీహెచ్ఎంలు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. కాగా చిన్న గ్రామపంచాయతీల్లో ఐసీడీఎస్ ఉద్యోగులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, ఉపాధి హామీ, ఐకేపీ, ఏఈవోలు, తదితర శాఖల ఉద్యోగులు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. వీరు సర్పంచుల స్థానాల్లో ప్రత్యేక అధికారులుగా విధులు నిర్వహించనున్నారు.