రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పంచాయతీ సెక్రటరీలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుబీర్ కు వచ్చిన డిపిఓ శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా.. పలువురు పంచాయతీ సెక్రెటరీ లు మాట్లాడుతూ.. ప్రత్యేక పాలన ఏర్పడినప్పటి నుండి అరకొర జీతాలతో కాలం వెలదీస్తూ అధికారుల ఒత్తిడితో గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎఫ్ఎమ్ఎస్ ద్వారా జమ చేస్తున్న చెక్కులు నెలల తరబడి పెండింగ్లో ఉండడం 18 నెలలుగా రాష్ట్ర ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామపంచాయతీ నిర్వహణ ఎలా చేయాలో తెలియక తీవ్రమైన మానసిక ఒత్తిడి లోన్ అవుతున్నారని అన్నారు.వెంటనే ప్రభుత్వాలు స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా ఉపాధి అని పథకంలో పర్యవేక్షులుగా ఉంచాలి.. సామాజిక తనిఖీలో బాధ్యులను చేయవద్దని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని గ్రామ పంచాయతీలలో వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిపిఓ కు అందజేశారు. పంచ సెక్రటరీలు విజయ్, సంజు తదితరులు పాల్గొన్నారు.