– స్థానిక ఎంపీడీవో ఆఫీస్ దగ్గర ధర్నా
– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-సదాశివపేట
గ్రామపంచాయతీ ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికులకు పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక్కరోజు సమ్మె సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచుతానని సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చినా అమలు జరపడం లేదన్నారు. అనేక గ్రామాలలో జీతాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు, గ్రామపంచాయతీ సిబ్బందిని తక్షణమే పర్మినెంట్ చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు . గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి దశరథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుంన్నారు ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పి ఆచరణలో మాత్రం అమలు జరపడం లేదన్నారు. అనేక రకాల పనులు చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని గుర్తించడం లేదన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకత్వంతో చర్చలు జరిపి పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. లేని యెడల ఈ రాష్ట్ర ప్రభుత్వంపై మరోపోరాటం చేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు శేఖర్, సంజీవులు, నగేష్ ఆనందం, మహేష్, రామచందర్, మైపాల్, పోచయ్య, యాదమ్మ, సుమలత, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-మునిపల్లి
ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రమైన మునిపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని, సిబ్బందిని తక్షణమే పర్మినెంట్ చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచుతానని సిబ్బందిని పర్మినెంట్ చేస్తా అని హామీ ఇచ్చిన అమలు జరపడం లేదని, అనేక గ్రామాలలో జీతాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని గ్రామపంచాయతీ సిబ్బందిని తక్షణమే పర్మినెంట్ చేయాలన్నారు. అలాగే మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పిన ఆచరణలో మాత్రం అమలు జరపడం లేదన్నారు. అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్న చాలీచాలని జీతాలతో పని చేస్తున్న మేము మా కుటుంబ పోషణ గడపడం చాలా కష్టంగా ఉందన్నారు. అనేక గ్రామాలలో అనేక రకాల పనులు మేము చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని గుర్తించడం లేదన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకత్వంతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలని లేదు యెడల మరో పోరాటం ఈ రాష్ట్ర ప్రభుత్వంపై చేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు ఇమ్మానియేల్, సాయిరాం, రవి, బిక్షపతి, ప్రభాకర్, నగేష్, నవీన్ , మల్లేశం, నర్సింలు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-జోగిపేట
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం అమలు చేయాలని సీఐటీయూ అందోల్ డివిజన్ కార్యదర్శి డి. విద్యాసాగర్ అన్నారు. గురువారం జోగిపేటలోని ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానాన్నిరద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్ లను సహాయ కార్యదర్శిలుగా నియమించాలని, ప్రతి నెల సబ్బులు, నూనె లు ఇతర వస్తువులు ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 21 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల అధికారులు వేధింపులు తక్షణమే ఆపాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, వేధింపులకు గురి చేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కార్యాలయ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిపి కార్మిక సంఘం నాయకులు వీరేశం, దుర్గేష్, పెంటయ్య, మల్లేశం, మహేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.