– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
గ్రామపంచాయతీ కార్మికులకు 7 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం రూ.20లక్షలు ఇవ్వాలని, సోమ వారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ మాట్లాడుతూ కార్మికులకు పెండింగ్ 7నెలల జీతాలు ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం రూ.20లక్షలు గుర్తింపు కార్డులు యూనిఫ్యామ్స్ సబ్బులు నూనెలు బూట్లు కనీస వేతనాలు రూ.26వేలు అమలు చేయాలని, ఈఎస్‌ఐ, ఫీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు యూనియన్ నాయకులు నవీన్ కుమార్, అంజయ్య, దుర్గయ్య, వెంకటయ్య, రాములు, నర్సింలు, అంజయ్య, అలవేలు, పద్మమ్మ, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.