గ్రామపంచాయతీ కార్మికులకు వెంటనే పర్మినెంట్ చేయాలి..

– వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ప్రకాష్ గైక్వాడ్
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కొనసాగిస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మెకు వైయస్సార్ తెలంగాణ షర్మిల పార్టీ నాయకులు తడి ఇప్పర్గా గ్రామ సర్పంచ్ ప్రకాష్ గాయక్వాడ్ ఆయనతో పాటు ఆ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ రైస్ కాన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ.. నిరవధిక సమ్మెలో కూర్చున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గైక్వాడ్ ప్రకాష్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పనిచేసే పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు న్యాయం జరిగే వరకూ వైయస్సార్ తెలంగాణ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని తెలిపారు. ఈ మద్దతు కార్యక్రమంలో ఆ పార్టీ డోంగ్లి మండల అధ్యక్షులు శ్రీకాంత్, తదితరులు, పంచాయతీ కార్మికులకు మద్దతు తెలిపారు.