గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె జయప్రదం చేయాలి

– రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి సమ్మె
– బషీరాబాద్‌ ఎంపీడీవో ఆఫీస్‌లో సమ్మె నోటీస్‌ అందజేసిన సీఐటీయూ నాయకులు
నవతెలంగాణ-తాండూరు
గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుండి నిర్వహించే సమయం జయప్రదం చేయాలని సీఐ టీయూ నాయకులు శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం బ షీరాబాద్‌ మండలంలో ఉన్న గ్రామపంచాయతీ కార్మికు లందరు జులై 6 నుండి గ్రామపంచాయతీ పనులు బందు పెట్టి సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పెరిగిన జీతాలు పెండింగ్‌ 3 నెలలు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్రామపంచాయతీ సిబ్బందిని వెంటనే పర్మినెంట్‌ చేయాలని జీవో నెంబర్‌ 51ని వెంటనే రద్దు చేయాలని, జీవో నెంబర్‌ 60 ప్రకారం గ్రామ పంచాయతీ వర్కర్లకు వేతనాలు చెల్లించాలన్నారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయని 50 వేల మంది గ్రామపంచాయతీ వర్కర్లు ఉన్నారని వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వా లని పీఎఫ్‌ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని జీపీ వర్కర్స్‌కు ట్రెజర్‌ ద్వారానే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పారిశుధ్య కార్మికులకు స్వీపర్లు పంపు ఆపరేటర్లు ఎలక్ట్రి న్సు డ్రైవర్లు కారోబార్లు బిల్‌ కలెక్టర్లు వాటర్‌ మ్యాన్లు నర్సరీలు వైకుంఠధామము పార్కులు ఆఫీస్‌ పనులు నిర్వ హిస్తున్నారని అన్నారు. 2011 జనాభా లెక్క ప్రకారం 500 మందికి ఒక జీపీ వర్కర్‌ నియమించడం తీవ్రమైన అన్యాయం జనాభా ప్రాతిపదికన లేకుండా గ్రామపంచా యతీ వర్కర్‌గా ఎంపీడీవో జిల్లా డీపీిఓ ద్వారా నియమిం చాలన్నారు. కార్యక్రమంలో వ్యకాస జిల్లా అధ్యక్షులు బు గ్గప్ప, గ్రామపంచాయతీ కార్మికుల నూతన కమిటీ అధ్య క్షులు ఎన్‌.శామప్ప, ఉపాధ్య క్షులు లక్ష్మి, లక్ష్మణ్‌, శామప్ప, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌, కోశాధికారి ఉషానప్ప, మండల కమిటీ సభ్యులుగా నర్సింలు, ఎల్లప్ప, బసమ్మ, దేవమ్మ, పార్వతమ్మ, రాములు, చిన్న లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.