గిరిజన ప్రాంతాల్లో కోరం లేకపోయినా గ్రామసభ

– నిబంధనల సవరణపై పిటిషన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
షెడ్యూల్డ్‌ ఏరియాల్లో కోరం లేకున్నా గ్రామసభ నిర్వహించి తీర్మానం చేసేందుకు వీలుకల్పిస్తూ 2019లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 54ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిని చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ విచారించి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్‌, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ జీవో గిరిజన హక్కులకు భంగం కలిగించేలా ఉందంటూ లంబాడి హక్కుల పోరాట సమితి నగర భేరీ ప్రధాన కార్యదర్శి భూక్యా దేవ నాయక్‌ వేసిన పిల్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.