
నిర్మల్మం జిల్లా కుబీర్ మండలంలోని చాత గ్రామంలో శుక్రవారం గ్రామంలో ఉన్న ఉపాధి హామీ కూలీలతో ఉపాది హామీ అధికారులు రానున్న రోజుల్లో నిర్వహించే పనులపై గ్రామ సభ నిర్వహించారు. దింతో ఉపాది హామీ టెక్నీకల్ అసిస్టెంట్ లు మహేష్, మునీర్ లు కూలీలతో మాట్లాడి గ్రామంలో ఎలాంటి పనులు జరిపించేలా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్బంగా ఉపాది హామీ అధికారులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి 100రోజులు పని కల్పించి వారికీ పనికి తగ్గట్టుగా కూలి డబ్బులు అందేలా చూస్తామని అన్నారు. అదే విదంగా వ్యవసాయా రైతులకు తమ వ్యవసాయా క్షేత్రంలో భూమి చదను, లేవాలింగ్ తో పాటు వివిధ రకాల పనులను చెపట్టుకునే విదంగా రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనిల్ కుమార్ మాజీ ఎంపీటీసీ లావణ్య లింగేష్ టెక్నీకల్ అసిస్టెంట్ లు మునీర్, మహేష్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెద్దన్న గులాబ్ బాలాజీ సీ ఏ విట్టల్ పిల్డఅసిస్టెంట్ కట్ట సుభాష్ గ్రామస్తలు తదితరులు పాల్గొన్నారు.