గండి కామారంలో గ్రామసభ

నవతెలంగాణ – మహాముత్తారం 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా గండికామారం గ్రామపంచాయతీ యొక్క  స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్   ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలనుండి చేసిన విశేష కృషి కి గాను జీపీ స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతీ కార్యదర్శి నూకల శివ శంకర్  మాజీ సర్పంచ్ నేరెళ్ల రమ తిరుపతి కి,ఉపసర్పంచ్ చందా లక్ష్మీ నారాయణ  మరియు మాజీ వార్డు సభ్యులకు ఘన వీడుకోలు సన్మాన కార్యక్రమం చేయుట జరిగింది. అలాగే గ్రామపంచాయతీ కి సంబందించిన ఏ సమస్య వచ్చిన కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని గ్రామపంచాయతీ మాజీ పాలక వర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామపంచాయతీ ప్రజలు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.